Basheerabad Police Arrested Transgender Over Threatening People For Money - Sakshi
Sakshi News home page

బలవంతంగా డబ్బులు లాక్కున్న ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్‌

Feb 16 2021 9:19 AM | Updated on Feb 16 2021 12:25 PM

Police Arrest Transgender For Money Extortion Threats To People - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అంతటితో ఆగకుండా తమ శరీర భాగాలను చూపిండమే కాకుండా మల్లేశ్‌ జేబుల్లోంచి రూ.4వేలు బలవంతంగా గుంజుకున్నారు.

కుత్బుల్లాపూర్‌: నూతన గృహప్రవేశం సందర్భంగా ఇంటి యజమానితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు బలవంతంగా డబ్బులు లాక్కున్న నలుగురు ట్రాన్స్‌జెండర్ల ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌ సోమవారం నూతన గృహప్రవేశం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్‌జెండర్లు స్వామి, శ్రావణి, శివాని, భూమిలు అక్కడకు వచ్చి డబ్బుల కోసం డిమాండ్‌  చేశాడు. ఇదేమని ప్రశ్నించడంతో ఇంటిపై రాళ్లు మట్టిపోసి శాపనార్ధాలు పెట్టారు. అంతటితో ఆగకుండా తమ శరీర భాగాలను చూపిండమే కాకుండా మల్లేశ్‌ జేబుల్లోంచి రూ.4వేలు బలవంతంగా గుంజుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

చదవండి: భోపాల్‌లో రెస్టారెంట్లు, లాంజ్‌లు, బార్లపై దాడులు
చదవండి: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement