breaking news
Qutbullapur
-
పూలు పేర్చి.. బతుకమ్మ ఆడి : బతుకమ్మ వేడుకలు ఘనంగా
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పసుపుతో తయారు చేసిన గౌరమ్మకు బియ్యం పిండి, నువ్వులు, నూకలతో తయారు చేసిన ప్రసాదంగా నివేదించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, యువతలు బతుకమ్మలను ఒక చోట పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. – కుత్బుల్లాపూర్ -
పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్, సాక్షి: కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హల్ చల్ చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల అదుపులో మల్లారెడ్డిసుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 భూవివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన ట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారంటూ ధర్నా చేపట్టారు. పోలీస్ స్టేషన్లోకి మీడియాను పోలీసులు అనుమతించడం లేదుస్థానికంగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్‌రెడ్డిలకు వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మాకోరుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. -
హైదరాబాద్: మైనర్ల ‘ప్రేమకథ’ విషాదాంతం
సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియని వయసు.. ప్రేమ పేరుతో ఆకర్షణ.. ఆ వయసుకి స్వతహాగానే పెద్దల మందలింపు.. వెరసి ఆ బాధలో ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ పేట్బషీరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. ఫాక్స్‌సాగర్‌లో దూకి ఓ మైనర్ జంట ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు.. ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అలాంటి పనులు వద్దంటూ మందలించారు. విద్యార్థినిని ఇంటి వద్దే ఉంచారు. ఈ క్రమంలో హఠాత్తుగా కనిపించకుండా పోయారు. తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చే వంకతో బయటకు వెళ్లిన విద్యార్థిని.. అతన్ని కలుసుకుంది. ఆపై వేరే విద్యార్థి ఇంట్లో బ్యాగు పెట్టేసి.. సైకిల్‌పై వెళ్లిపోయారు. వాళ్లు కనిపించపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా వాళ్లు చెరువు వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గజ ఈతగాళ్లతో వెతక్కగా.. ముందుగా విద్యార్థిని మృతదేహాం దొరికింది. ఇక ఇవాళ(శుక్రవారం) ఉదయం విద్యార్థి దేహం దొరకడంతో.. ఈ ప్రేమ వ్యవహారం విషాదాంతం అయినట్లు పోలీసులు నిర్ధారించారు. -
బలవంతంగా డబ్బులు లాక్కున్న ట్రాన్స్జెండర్లు అరెస్ట్
కుత్బుల్లాపూర్: నూతన గృహప్రవేశం సందర్భంగా ఇంటి యజమానితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు బలవంతంగా డబ్బులు లాక్కున్న నలుగురు ట్రాన్స్జెండర్ల ను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దూలపల్లి గ్రామానికి చెందిన మల్లేశ్ సోమవారం నూతన గృహప్రవేశం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ట్రాన్స్జెండర్లు స్వామి, శ్రావణి, శివాని, భూమిలు అక్కడకు వచ్చి డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. ఇదేమని ప్రశ్నించడంతో ఇంటిపై రాళ్లు మట్టిపోసి శాపనార్ధాలు పెట్టారు. అంతటితో ఆగకుండా తమ శరీర భాగాలను చూపిండమే కాకుండా మల్లేశ్ జేబుల్లోంచి రూ.4వేలు బలవంతంగా గుంజుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. చదవండి: భోపాల్‌లో రెస్టారెంట్లు, లాంజ్‌లు, బార్లపై దాడులు చదవండి: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం -
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
-
జీహెచ్ఎంసీ: వెంటాడుతున్న కోవిడ్ భూతం!
పెరుగుతున్న కోవిడ్–19 పాజిటివ్ కేసులతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలను కరోనా భూతం వెంటాడుతోంది. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో 869 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 29, మేడ్చల్ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా పాజిటివ్ కేసులు ఆగడం లేవు. తాజాగా పరిపాలన విభాగంలోని మరో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదే విభాగంలో గత వారం కూడా ఓ ఉద్యోగికి కరోనా సోకిన తెలిసిందే. ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో.. ఉప్పల్ : ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో మంగళవారం ఒక్క రోజే 42 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హబ్సిగూడలో డివిజన్లోని కామాక్షిపురంలో 5, హబ్సిగూడలో ఒకటి, వెంకట్‌రెడ్డినగర్‌లో 3, శ్రీరాంనగర్ కాలనీలో 3, రామంతాపూర్ డివిజన్లోని అరవింద్‌నగర్ కాలనీలో 4, విద్యానగర్‌లో ఒకటి, ఉప్పల్ డివిజన్లో భరత్‌నగర్‌లో 3, గాంధీనగర్‌లో 2, కురుమానగర్‌లో 2, విజయపురి కాలనీలో 2, బీరప్పగడ్డలో 2, నాచారంలో 3, నాగోల్‌లో 5, మల్లాపూర్‌లో 6 కేసులు నమోదయ్యాయి. రామంతాపూర్ నేతాజీనగర్ చెందిన ఓ వృద్ధుడు (65) మృతిచెందాడు. (ఎన్నారై భర్తలు వేధిస్తే సమాచారమివ్వండి) కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో... దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి. సూరారం కాలనీ వెంకట్రామ్‌నగర్‌కు చెందిన వ్యక్తి(39), బాచుపల్లికి చెందిన యువకుడు(28), చింతల్ మారుతీనగర్‌కు చెందిన వ్యక్తి (55), గణేష్‌నగర్‌కు చెందిన మహిళ(33), గాజులరామారానికి చెందిన వ్యక్తి (30), నిజాంపేట్ రాజీవ్ గృహకల్పకు చెందిన వ్యక్తి (33), జీడిమెట్ల గ్రామానికి చెందిన వ్యక్తి (35), మీనా క్షి ఎస్టేట్స్‌కు చెందిన వ్యక్తి(58), అపురూపా కాలనికి చెందిన వ్యక్తి (48), జీడిమెట్ల శ్రీనివాస్‌నగర్‌కు చెందిన వ్యక్తి (45), జగద్గిరిగుట్టకు చెందిన మహిళ (35), చింతల్ సాయినగర్‌కు చెందిన మహిళ (52), వాణినగర్‌కు చెందిన వ్యక్తి (42), ప్రగతినగర్‌కు చెందిన వ్యక్తి (32), యువకుడు (28), యువతి (26), మరో యువకుడు (29), వ్యక్తి(39), హెచ్ఏఎల్ కాలనీకి చెందిన యువకుడు (26), వృద్ధురాలు (69), మరో యువకుడు (21), కొంపల్లి జయభేరి పార్కుకు చెందిన మహిళ (40), కొంపల్లి బొబ్బిలి అంపైర్‌కు చెందిన యువకుడు (20), కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి (42), నిజాంపేట్ వెంకటనగర్‌కు చెందిన వృద్ధురాలు (68), బాచుపల్లికి చెందిన మహిళ (30)కు కరోనా సోకడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కీసర పీహెచ్సీ పరిధిలో... కీసర : కీసర పీహెచ్సీ పరిధిలో కొత్తగా మరో 3 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్ కాలనీకి చెందిన మహిళకు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు శ్రీలక్ష్మీనగర్కాలనీలో ఓ మహిళాకు, మండల కేంద్రమైన కీసరలో ఓ ఆర్ఎంపీ వైద్యుడికి కరోనా నిర్ధారణ అయ్యిందని కీసర మండల వైద్యాధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులను హోం క్వారైంటైన్లో ఉంచామన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో... మారేడుపల్లి : కంటోన్మెంట్ నాలుగు, ఐదు వార్డులలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. కార్ఖానా అమరావతి కాలనీకి చెందిన తండ్రి, కొడుకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. పికెట్ లక్ష్మీనగర్‌లో ఒక కానిస్టేబుల్ కరోనా బారిన పడ్డారు. ముగ్గురినీ హోమ్ క్వారంటైమ్‌లో ఉంచినట్లు మెడికల్ ఆఫీసర్ మీనా తెలిపారు. కరోనా పాజిటివ్ నివాసాల వద్ద కంటోన్మెంట్ సానిటేషన్ విభాగం అధికారులు బ్లీచింగ్ పౌడర్‌తోపాటు సోడియం హైడ్రోఫ్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. కాప్రాలో... కాప్రా : సర్కిల్ పరిధిలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 90కి చేరింది. నాచారం డివిజన్ బాబానగర్, చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో ఒక్కో కేసు, కాప్రా డివిజన్ గౌడపురి కాలనీలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ కాగా, 54 యాక్టివ్ కేసులున్నాయి. ఘట్కేసర్ పట్టణంలో... ఘట్కేసర్ : ఘట్కేసర్ పట్టణంలోని సాయినగర్‌కు చెందిన మహిళ(30), ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన మరో మహిళ(58)కు కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. స్థానిక కౌన్సిలర్ కొమ్మిడి అనురాధ వైద్యసిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాలకు వెళ్లే దారులను మూసివేయించారు. కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి రెడ్ జోన్ బోర్డులను ఏర్పాటు చేశారు. సాయినగర్‌లో వృద్ధుడి మృతి నిజాంపేట్ : కరోనా లక్షణాలతో సాయినగర్‌లో ఓ వ్యక్తి మృతి సోమవారం రాత్రి మృతి చెందాడు. సాయినగర్‌లో ఉండే షేక్ చాన్‌బాషా(60) బోరబండలో టైలర్‌గా జీవనం సాగిస్తున్నాడు. పది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఊపిరి తీసుకోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా కరోనా లక్షణాలు ఉన్నట్లు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఆయన మృతి చెందాడు. దీంతో చాన్‌బాషా అంత్యక్రియలను పీపీఈ కిట్లు ధరించి చేసేలా కార్పొరేటర్ కాసాని శిరీష చర్యలు తీసుకున్నారు. తుకారాంగేట్‌లో... అడ్డగుట్ట : అడ్డగుట్ట డివిజన్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తుకారాంగేట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఓ వ్యక్తి(43), ఓ మహిళ(31) కరోనా బారిన పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కిషన్‌బాగ్ కొండారెడ్డిగూడలో... బహదూర్‌పురా : కిషన్‌బాగ్ డివిజన్లోని కొండారెడ్డిగూడలో ఓ వ్యక్తి(45)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనను హోమ్ క్వారంటైన్ చేశామని కిషన్‌బాగ్ నోడల్ అధికారి బాలకృష్ణ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో... వెంగళరావునగర్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో తొమ్మిది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ ఎ.రమేష్ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్లో నలుగురికి, ఎర్రగడ్డ, రహమత్‌నగర్ డివిజన్ల పరిధిల్లో ఇద్దరు చొప్పున, బోరబండ డివిజన్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. ఎల్బీనగర్ పరిధిలో... ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ çమూడు సర్కిళ్ల పరిధిలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్‌ను మోగిస్తుది. వారం రోజులుగా వైరస్ వ్యాప్తి ఉధృతం కావడంతో 107 మంది మంచానికే పరిమితయ్యారు. మరికొందరు గాంధీ, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. కేవలం మంగళవారం ఒక్కరోజే చంపాపేట, çహయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సురాబాద్, నాగోల్‌లలో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన కాలనీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అనుమానితులను హోం క్వారంటైన్లలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. -
కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యేకు మాతృవియోగం
సాక్షి, హైదరాబాద్ : కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద తల్లి శ్యామల మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం శ్యామల అంత్యక్రియలు జరుగనున్నాయి. -
ఓటుతో తలరాతను మార్చుకుందాం: జగన్
-
ఓటుతో తలరాతను మార్చుకుందాం: వైఎస్ జగన్
హైదరాబాద్: ఓటుతో మన తలరాతను మనమే మార్చుకుందామని కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉండాలని రాష్ట్రానికే కాదు, దేశానికే చాటి చెప్పిన మహానేత వైఎస్ఆర్ అని వైఎస్ జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి వైఎస్ఆర్ ఉచిత, కార్పోరేట్ వైద్యం అందించిన విషయాన్ని వైఎస్ జగన్ ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. పేదరికం పోవాలంటే ఇంటినుంచి ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలని వైఎస్ఆర్ అనేవారన్నారు. పేద ప్రజల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి వైఎస్ఆర్ ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అందించారని జగన్ తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.