ఓటుతో మన తలరాతను మనమే మార్చుకుందామని కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన రోడ్ షోలో వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉండాలని రాష్ట్రానికే కాదు, దేశానికే చాటి చెప్పిన మహానేత వైఎస్ఆర్ అని వైఎస్ జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి వైఎస్ఆర్ ఉచిత, కార్పోరేట్ వైద్యం అందించిన విషయాన్ని వైఎస్ జగన్ ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. పేదరికం పోవాలంటే ఇంటినుంచి ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలని వైఎస్ఆర్ అనేవారన్నారు. పేద ప్రజల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించడానికి వైఎస్ఆర్ ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అందించారని జగన్ తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Apr 28 2014 4:08 PM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement