క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌ | Person Arrested For Cricket Betting In Hyderabad | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

Oct 13 2020 4:53 PM | Updated on Oct 13 2020 5:13 PM

Person Arrested For Cricket Betting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : కరోనా సీజన్‌లోనూ ఐపీఎల్‌ బెట్టింగ్‌లు జోరుగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్‌లకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేయడం లేదు. తాజాగా హైదరాబాద్‌ దూల్‌పేట్‌కు చెందిన శివశంకర్‌ సింగ్‌ అనే వ్యక్తి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అతన్ని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కాగా శివశంకర్‌ వద్ద నుంచి రూ. 56వేల నగదు, సెల్ ఫోన్, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి : ఐపీఎల్‌ బెట్టింగ్: రూ.16 కోట్లు‌ స్వాధీనం)

Advertisement
 
Advertisement
Advertisement