AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం | Pdf MLC Shaik Sabji Died In Road Accident In West Godavari Sakshi
Sakshi News home page

AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం

Dec 15 2023 1:19 PM | Updated on Dec 15 2023 1:55 PM

Pdf Mlc Shaik Sabji Died In Road Accident West Godavari - Sakshi

రోడ్డు ప్రమాదంలో  పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు.

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: రోడ్డు ప్రమాదంలో  పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్‌, గన్‌మెన్‌, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి
మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి కేబినెట్‌ సంతాపం తెలిపింది. కేబినెట్‌ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు.

Advertisement
 
Advertisement
Advertisement