జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం సమీపంలోని మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో బుధవారం కార్తీకమాసం మొదటి బుధవారం రోజున లక్ష గులాబీ పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు, సాత్వికుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే 250 మంది భక్తులు మద్ది ఆంజనేయస్వామివారి దీక్షలు తీసుకున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణ అధికారిణి ఆర్వి చందన తెలిపారు.
భీమవరం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–14 క్రికెట్ జట్టు కెప్టెన్గా స్థానిక విశ్వకవి స్కూల్ విద్యార్థి నంబూరి కార్తీక్ వర్మ ఎంపికయ్యాడు. ఈ నెల 12 నుంచి 17 వరకు గుంటూరు జిల్లా పేరేచర్ల, పిచ్చుకుటగుంటలో నిర్వహించే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో కార్తీక్ వర్మ నాయకత్వంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టు.. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల జట్లతో తలపడుతుందని డీఎన్నార్ అకాడమీ క్రికెట్ కోచ్ శ్రీనివాస్ తెలిపారు.


