మల్లఖంబ్‌ రాష్ట్ర జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

మల్లఖంబ్‌ రాష్ట్ర జట్టు ఎంపిక

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

భీమవరం : ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ రాష్ట్రస్థాయి మల్లఖంబ్‌ ఎంపికలను భీమవరం పట్టణంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్‌లో నిర్వహించారు. ఇందులో భాగంగా అండర్‌–18 బాలురు, బాలికలకు పోల్‌, రోప్‌, హ్యాంగింగ్‌ మల్లఖంబ్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, విశాఖపట్నం జిల్లాల నుంచి 36 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు జరిగే జాతీయస్థాయి ఖేలో ఇండియా మల్లఖంబ్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ నూతక్కి మోహన్‌దాస్‌ బుధవారం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శేఖర్‌రాజు, రామభద్రిరాజు రిఫరీలుగా వ్యవహరించగా, ఎస్‌జీఎఫ్‌ అబ్జర్వర్‌ పరశురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపికై న క్రీడాకారుల వివరాలు

బాలుర విభాగం : కె.తనుజ్‌, జె.సతీష్‌, ఎ.లక్ష్మణ్‌ (తూర్పుగోదావరి); పి.రోహిత్‌, పి. గోపికృష్ణ కుమార్‌ (పశ్చిమగోదావరి), ఎస్‌.చైతన్య (విశాఖ).

స్టాండ్‌బైలు : ఎ.రాము (తూర్పుగోదావరి), ఆర్‌.చందు, హర్ష రామ్‌ (విశాఖ).

బాలికల విభాగం : ఆర్‌.మనీషా, వి.తనుశ్రీప్రభ, ఎ.భువనచంద్రిక, ఐ.విద్యుల్లత (పశ్చిమగోదావరి), కె.దేవి (తూర్పుగోదావరి), లక్ష్మీవినీల (విశాఖ).

స్టాండ్‌బైలు : ఎన్‌.ప్రశాంతి, ఎం.వైష్ణవి (పశ్చిమగోదావరి); కె.హరిణి (విశాఖ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement