ఎన్నో కలలతో మెట్టినింట కాలు మోపింది.. ఏడాదిన్నర కాకుండానే.. | Newly Married Woman Ends Her Life Karnataka | Sakshi
Sakshi News home page

ఎన్నో కలలతో మెట్టినింట కాలు మోపింది.. ఏడాదిన్నర కాకుండానే..

Jan 8 2022 6:48 AM | Updated on Jan 8 2022 7:07 AM

Newly Married Woman Ends Her Life Karnataka - Sakshi

కీర్తన( ఫైల్‌ ఫోటో)

మండ్య(బెంగళూరు): మెట్టినింట కాలు మోపి ఏడాదిన్నర కూడా కాకనే వివాహిత బలవన్మరణం చెందింది. వివరాలు..  మద్దూరు తాలూకా, గొల్లరదొడ్డి గ్రామానికి చెందిన కీర్తనకు,  నాగమంగల తాలూకాలోని కుడుగుబాళు గ్రామానికి చెందిన రవికి యేడాదిన్నర క్రితం వివాహమైంది. కొన్ని నెలలపాటు సవ్యంగా సాగిన వారి కాపురంలో ఇటీవల కలతలు చోటు చేసుకున్నాయి. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఆవేదనకు గురైన కీర్తన శుక్రవారం తెల్లవారుజామున ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య  చేసుకుంది. నాగమంగల గ్రామీణ పోలీసులు  కేసు దర్యాప్తు చేపట్టారు.

కుమార్తె అనారోగ్యం.. తల్లి ఆత్మహత్య
మైసూరు: నారోగ్యంతో తన ఏడేళ్ల కుమార్తె పడుతున్న వేదనను చూడలేక ఓ తల్లి ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు నగరంలోని చెలువాంబ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. నగరంలోని హోటెగళ్లి ప్రాంతానికి చెందిన యాస్మిన్‌(30) ఆనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను ఇక్కడి చెలువాంబ ఆస్పత్రిలో చేర్పించింది. కుమార్తె పడుతున్న వేదనను తట్టుకోలేక బాత్‌రూమ్‌లోకి వెళ్లి చాకుతో గొంతు కోసుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన కేఆర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement