Newly Married Bride Commits Suicide Due To Unwilling Marriage In Tiruvottiyur - Sakshi
Sakshi News home page

వరుడు నచ్చకపోయినా వివాహం.. పెళ్లయిన పదిరోజులకే..

Sep 17 2022 2:43 PM | Updated on Sep 17 2022 3:57 PM

Newly Married Bride Commits Suicide in Tiruvottiyur - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

కుమా ర్తె విమలాదేవి (20)తో ఈ నెల 5వ తేదీన వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్త ఇంట్లో ఉంటున్న విమలాదేవి బుధవారం రాత్రి హఠా త్తుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది.

తిరువొత్తియూరు (చెన్నై): వరుడు నచ్చకపోవడంతో వివాహమైన పది రోజులకు ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలం జిల్లా సంగ గిరి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మే రకు.. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని దేవయూరు నల్లకినరు గ్రామానికి చెందిన పళనిస్వామి కుమారుడు జీవానందం (27) మొబైల్‌ ఫోన్‌ సర్వీస్‌ దుకాణంలో పని చేస్తున్నాడు.

ఇతనికి ఈరోడ్‌ జిల్లా కాడప్పనూర్‌ పంచాయతీ గుదిరైకాల్‌మేడుకు చెందిన కుప్పుస్వామి కుమా ర్తె విమలాదేవి (20)తో ఈ నెల 5వ తేదీన వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్త ఇంట్లో ఉంటున్న విమలాదేవి బుధవారం రాత్రి హఠా త్తుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్ష కోసం ఎడప్పాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

వివాహమైన పది రోజులకే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పోలీసులు జరిపిన విచారణలో వరుడు నచ్చకపోయినా తల్లిదండ్రులు నిర్బంధంగా విమలాదేవికి వివాహం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.   

చదవండి: (ప్రేమకు నిరాకరించిందన్న కక్షతో నవ వధువు దారుణ హత్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement