ప్రేమకు నిరాకరించిందన్న కక్షతో నవ వధువు దారుణ హత్య

దొడ్డబళ్లాపురం: తన ప్రేమను నిరాకరించిందన్న కక్షతో నవ వధువును కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటుచేసుకుంది. సౌమ్య (23)హత్యకు గురైన వివాహిత. సుబ్రమణ్య (25) హత్య చేసిన నిందితుడు. సౌమ్య, సుబ్రమణి ఇద్దరూ గతంలో బెంగళూరు నాగవార వద్ద ఉన్న కాఫీడేలో పనిచేసేవారు.
అప్పుడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని రోజుల క్రితం సౌమ్య హఠాత్తుగా పనిమానేసింది. రెండు వారాల క్రితం వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సౌమ్య తనను మోసం చేసిందని పగతో రగిలిపోయిన సుబ్యమణ్య సమయం కోసం వేచి చూసాడు. ఇలా ఉండగా బుధవారం సౌమ్య అవతికి వచ్చింది.
అదే రోజు రాత్రి సౌమ్య ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన సుబ్యమణ్య ఇంట్లో జొరబడి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సౌమ్య కేకలు విన్న స్థానికులు పరుగున రావడంతో సుబ్రమణ్య ఇంటి వెనుక నుంచి గోడదూకి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: పొద్దెక్కిన పావని నిద్రలేవలేదు..శరీరం పచ్చగా మారడంతో)
సంబంధిత వార్తలు