హేమంత్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌! | New Twist In Hemanth Kumar Assassination Case | Sakshi
Sakshi News home page

హేమంత్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌!

Sep 27 2020 3:46 PM | Updated on Sep 27 2020 8:16 PM

New Twist In Hemanth Kumar Assassination Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హేమంత్‌ కుమార్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తన భర్త హత్యలో సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని అవంతి ఆరోపిస్తున్నారు. గతంలో సందీప్‌రెడ్డి హేమంత్‌ తండ్రిపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. హేమంత్‌ రెండు లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడంటూ నెల రోజుల క్రితం సందీప్‌‌ బెదిరింపులకు దిగాడని చెప్పారు. సందీప్‌రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని అవంతి అంటున్నారు. అయితే హేమంత్ కుమార్‌ కిడ్నాప్ అయిన రోజునే గచ్చిబౌలి పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

చదవండి : హేమంత్‌ హత్య : అసలు తప్పెవరిది?

Advertisement
 
Advertisement
Advertisement