సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల

Nellore: Fir Complaint Filed Against On Fake Director Praveen kumar - Sakshi

సాక్షి, నెల్లూరు: సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్న ఓ కీచక దర్శకుడి బండారం బయటపడింది. వివరాల ప్రకారం.. ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తి తాను చెన్నైలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌నని ప్రస్తుతం షార్ట్‌ ఫిల్మ్స్‌ తీయబోతున్నట్లు ప్రచారం చేసుకుంటూ, అందుకు నటీమణులు కావాలని అమ్మాయిలకు నమ్మబలికే వాడు. ఇందులో భాగంగా సూళ్లూరుపేటలో శ్రీ చెంగాలమ్మ మహత్యం మూవీ క్రియేషన్స్ పేరిట కార్యాలయం కూడా ప్రారంభించాడు. 

యువతుల ఆశను అవకాశంగా మార్చుకుంటూ వారిపై లైంగికి దాడులకు పాల్పడేవాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురిచేస్తుంటే అది భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అనంతరం సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ప్రవీణ్, చిత్ర యూనిట్ సభ్యులు పరారీలో ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top