దాని రీల్స్‌ చూస్తావా?.. భర్తపై అఘాయిత్యం | Nandigama Wife Attacked Husband Over First Wife Insta Reels | Sakshi
Sakshi News home page

నందిగామ: దాని రీల్స్‌ చూస్తావా?.. భర్తపై రెండో భార్య అఘాయిత్యం

Jul 22 2023 12:59 PM | Updated on Jul 22 2023 1:04 PM

Nandigama Wife Attacked Husband Over First Wife Insta Reels - Sakshi

మొదటి భార్య రీల్స్‌ చూస్తున్నాడని మర్మాంగాన్ని కోసేసిందా భార్య.. 

సాక్షి, ఎన్టీఆర్‌: నా మొగుడు నాకే సొంతం అనుకున్న ఓ భార్య.. భర్తపై అఘాయిత్యానికి తెగబడింది. బ్లేడ్‌తో మర్మాంగాన్ని కోసి ఆస్పత్రి పాలు జేసింది. నందిగామలోని అయ్యప్ప నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. 

ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్‌ బాబుకు గతంలో ఓ వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా ఆమెతో విడిపోయిన ఆనంద్‌.. ఐదేళ్ల కిందట వరమ్మ అనే రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఇన్నేళ్ల కాపురం తర్వాత మొదటి భార్య విషయంలో వరమ్మ ఆనంద్‌తో గొడవకు దిగింది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో మాజీ భార్య రీల్స్‌ చూస్తున్నాడని అనుమానం పెంచుకున్న ఆమె.. భర్తతో గొడవకు పడుతూ వస్తోంది. ఈ క్రమంలో గత రాత్రి(శుక్రవారం) ఆనంద్ బాబు తన మొదటి భార్య Instagram వీడియోలు చూస్తుండటం గమనించిన వరమ్మ.. ఆగ్రహంతో ఊగిపోయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. బ్లేడ్‌తో భర్త మర్మాంగాన్ని కోసేసిందామె. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడ్ని నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి...మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement