పున్నమి వేళ..
కృష్ణవేణి కార్తిక దీప కాంతులతో మెరిసిపోయింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేకువజామునే కృష్ణమ్మ చెంతకు చేరి పుణ్యస్నానాలాచరించారు. అరటి డొప్పల్లో దీపాలు వదిలి భక్తితో నదీమతల్లికి నీరాజనాలు పలికారు. అనంతరం శివాలయాలకు చేరి స్వామి పూజలో తరించారు. అభిషేకాలు, దీపారాధనలు చేసి దీవెనల కోసం వేడుకున్నారు. విజయవాడ దుర్గా ఘాట్‌లో మంగళవారం
తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులను చిత్రాల్లో చూడొచ్చు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


