కొడుకు కోసం 24 మందిని మోసం చేసింది | Mother Cheats 24 People To Rescue Her Son From Debt | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం 24 మందిని మోసం చేసింది

Jan 31 2021 11:35 AM | Updated on Jan 31 2021 4:53 PM

Mother Cheats 24 People To Rescue Her Son From Debt - Sakshi

రూపాల్‌ పాండ‍్య

తల్లి రూపాల్‌ నడుం బిగించింది..బ్యూటీ పార్లర్‌ నడుపుతున్న ఆమె...

ముంబై : కుమారుడు చేసిన కోట్ల రూపాయల అప్పులు తీర్చడానికి 24 మందిని మోసం చేసిందో మహిళ. ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి 2 కోట్ల రూపాయలు దోచేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ములంద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న రూపాల్‌ పాండ‍్య అనే మహిళ కుమారుడు ఇషాన్‌ పెళ్లయిన తర్వాత దుబాయ్‌లో స్థిరపడ్డాడు. జూదం అలవాటున్న అతడు అక్కడి ఓ క్యాషినోలో 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో కుమారుడు చేసిన అప్పులు తీర్చడానికి తల్లి రూపాల్‌ నడుం బిగించింది.
( ప్రేమికుడి బాబా వేషం.. గడ్డం లాగడంతో..)

బ్యూటీ పార్లర్‌ నడుపుతున్న ఆమె ఎక్కువ వడ్డీ ఇస్తానంటూ కస్టమర్లు, పరిచయస్తుల దగ్గర అప్పులు చేసింది. ఇలా 2 కోట్ల రూపాయలు తీసుకుంది. తిరిగిస్తానన్న సమయం దాటిపోతున్నా రూపాల్‌ డబ్బు ఇవ్వకపోవటంతో అప్పిచ్చిన వారంతా ఒక్కొక్కరిగా పోలీసులకు పిర్యాదు చేశారు. ఆమెపై మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. రూపాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement