ప్రేమికుడి బాబా వేషం.. గడ్డం లాగడంతో..

Lover Change Act As Baba At His Girlfriend Home In Bhubaneswar - Sakshi

స్థానికుల చేతిలో చావుదెబ్బలు

భువనేశ్వర్‌: ప్రియురాలి బాగోగులు తెలుసుకునేందుకు బాబా వేషం ధరించాడు ఓ ప్రేమికుడు. చివరి దశలో వ్యూహం బెడిసి కొట్టింది. స్థానికులకు పట్టుబడి చావు దెబ్బలు తిన్నాడు ప్రియుడు. జాజ్‌పూర్‌ రోడ్‌ ఫెర్రో క్రోమ్‌ గేటు కాలనీలో శనివారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. బాబా వేషంలో వీధిలో తిరుగాడుతున్న ప్రేమికుడిని పిల్లల దొంగగా భావించిన స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు కథ బట్టబయలైంది. ఈ వేషగాడు అంగుల్‌లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమించాడు. విద్యార్థిని కుటుంబ సభ్యులు వీరి ప్రేమని నిరాకరించారు.

దీంతో ప్రియురాలి ఇంట్లో తాజా పరిస్థితులను తెలుసుకునేందుకు ఆమెతో ముఖాముఖి భేటీ కావాలనుకున్నాడు. తక్షణమే వేషం మార్చి బాబాగా తయారయ్యాడు. ప్రియురాలి ఇంటి పరిసరాల్లో తిరుగాడుతున్న అతన్నిపై అనుమానంతో స్థానికులు పట్టుకుని నిలదీశారు. మొదట తాను హిమాలయాల నుంచి వచ్చినట్లు బుకాయించాడు. అతడి సమాధానాలతో ఏకీభవించని స్థానికులు సందేహంతో గడ్డం లాగడంతో బండారం బట్టబయలైంది. దొంగ బాబాను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top