మైనర్‌పై పలుమార్లు అత్యాచారం.. శిశువు జననం | Minor Girl Molested In Thane Maharashtra | Sakshi
Sakshi News home page

మైనర్‌పై పలుమార్లు అత్యాచారం.. శిశువు జననం

Nov 28 2020 7:39 AM | Updated on Nov 28 2020 7:39 AM

Minor Girl Molested In Thane Maharashtra - Sakshi

ముంబై (థానే): పట్టణంలోని కల్యాణ్‌ ప్రాంతంలో 15 ఏళ్ల మైనర్‌ బాలికపై 21 ఏళ్ల వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో ఆ బాలిక గర్భం దాల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో మైనర్‌ బాలిక ఇంటిపక్కనే ఉన్న 21 ఏళ్ల వ్యక్తి బాధితురాలికి మాయమాటలు చెప్పి గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టడంతో బాలిక గర్భవతి అయింది. దీంతో కొద్ది రోజుల క్రితం బాధితురాలు ఓ శిశువుకి జన్మనిచ్చింది. విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు బిహార్‌ పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.   (ఆన్‌లైన్‌ గేమ్‌.. మరో యువకుడు బలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement