పెంచిన తండ్రినే కడతేర్చిన కసాయి కూతురు

Minor Girl Assassinated Adoptive Father With Help Of Her Friend - Sakshi

ఉత్తరప్రదేశ్‌: ఒక బాలిక తన​ స్నేహితుడుతో కలిసి పెంచిన తండ్రినే కడతేర్చింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో వైశాలి అపార్టమెంట్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆ బాలికను పుట్టిన వారం రోజులకే ఘజియాబాద్‌లోని ఒక దంపతులు దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం  ఆ బాలిక ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. 14 ఏళ్ల బాలిక తన స్నేహితుడుతో కలిసి 58 ఏ‍ళ్ల పెంచిన తండ్రిని  చేతులు కాళ్లు కట్టేసి.. ఒక రోప్‌తో చంపేసి పరారయ్యింది. సాయంత్రం బాధితుడు భార్య ఇంటికి వచ్చి చూడగా అతను చనిపోయి ఉన్నాడు.

ఐతే బాధితుడు భార్య తాము పెంచుకుంటున్న కూతురుపైన అనుమానంగా ఉందని తెలిపింది. ఆమె గత కొద్ది రోజులుగా ఒక వ్యక్తితో తరుచుగా మాట్లాడటం, చాటింగ్‌లు వంటివి చేసిందని కూడా ఆమె చెప్పింది. కొన్ని నెలల క్రితం సదరు బాలిక 19 ఏళ్ల యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. అప్పుడు బాధితుడు పోలీస్‌ స్టేషన్‌లో సదరు యువకుడిపై పోస్కో చట్టం కింద కేసు పెట్లి జైలుకి పంపించి, కూతురుని ఇంటికి తీసుకు వచ్చారు.  తండ్రి  ఇలాంటి యువకులను వదిలిపెట్టకూడదని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు చెబితే కూతురు మాత్రం ఆ యువకుడికి అనుకూలంగా  పోలీస్టేషన్‌లో స్టేట్‌మెంట్‌లు ఇచ్చింది.

ఐతే ఆ బాలిక మాత్రం తండ్రి తీరుపై కక్ష పెంచుకుని జైల్లో ఉన్న యువకుడితో టచ్‌లోనే ఉంది. అంతేగాదు తన తండ్రి వేధిస్తున్నాడని తనను తీసుకుపోవాలని చెబుతుండేది. దీంతో ఆ యువకుడు ఆమె మాటలకు జాలిపడి ఆమెతో కలిసి అతన్ని చంపేందుకు కుట్రపన్నాడు. దీంతో సదరు యువకుడు 23 ఏళ్ల మరో యువకుడిని పురమాయించి ఈ హత్యకు పథకం వేశాడు. బాలిక ఆ యువకుడితో కలిసి తండ్రిని రోప్‌తో చంపేసి ఇంట్లోంచి కొన్ని క్రెడిట్‌ కార్డులు తీసుకుని పరారయ్యింది. ఐతే పోలీసులు సీసీటీపీ పుటేజ్‌లు ఆధారంగా సదరు నిందితులను గుర్తించి ఫోన్‌ కాల్స్‌ ద్వారా ట్రేస్‌ చేసి పట్టుకున్నారు. విచారణలో నిందితులిద్దరు నేరం చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. 

(చదవండి: దారుణం...బ్లాక్‌మెయిల్‌ చేసి 8 మంది అత్యాచారం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top