హ్యాపీ బర్త్‌డే టు యూ షెహన్‌షా..

Man Celebrates Bull Birthday Party By Violating COVID 19 Norms - Sakshi

ముంబై : కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఎద్దు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన యజమానిపై, వేడుకల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. థానే జిల్లా, డాంబివ్లీలోని రేతీ బందర్‌కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం కోవిడ్‌ నిబంధనలను తుంగలో తొక్కుతూ పెంపుడు ఎద్దు షెహన్‌షాకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు. ఇందులో అతడి స్నేహితులు కూడా పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ కావటంతో సంఘటన వెలుగు చూసింది. ‘‘హ్యాపీ బర్త్‌డే టు యూ.. హ్యాపీ బర్త్‌ డే టు యూ.. షెహన్‌షా....’’ అంటూ ఎద్దుకు కేకు తినిపిస్తున్న దృశ్యాలను మనం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లటంతో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం అన్వేషిస్తున్నారు.

చదవండి : మైనర్‌తో ప్రేమ.. పెళ్లి చేయాలంటూ పోలీస్ ‌స్టేషన్‌లో..

అలిపిరి బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top