Man Tries To Commit Suicide At The Police Station To Marry The Minor Girl He Loves - Sakshi
Sakshi News home page

మైనర్‌తో ప్రేమ.. పెళ్లి చేయాలంటూ పోలీస్ ‌స్టేషన్‌లో..

Mar 13 2021 5:17 PM | Updated on Mar 13 2021 6:24 PM

Love With Minor Man Trying To Set Blaze At Police Station - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సదరు బాలికతో తనకు పెళ్లి చేయాలని పోలీసులను కోరాడు. వారు అదంతా కుదరదని స్పష్టం చేశారు. దీంతో...

భువనేశ్వర్‌ : ప్రేమించిన బాలికతో తనకు పెళ్లి చేయాలంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు ఓ యువకుడు. ఈ సంఘటన ఒరిస్సాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భువనేశ్వర్‌, గజపతి నగర్‌కు చెందిన అజయ్‌ దొర అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్‌(16)ను ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబసభ్యులు ఆమెను రాజస్తాన్‌లోని బంధువుల ఇంటికి పంపేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం అజయ్‌ బ్యాగులో పెట్రోల్‌ బాటిల్‌తో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. సదరు బాలికతో తనకు పెళ్లి చేయాలని పోలీసులను కోరాడు. వారు అదంతా కుదరదని స్పష్టం చేశారు. దీంతో అతడు బ్యాగులోని పెట్రోల్‌ బాటిల్‌ తీసి పెట్రోల్‌ మీద పోసుకున్నాడు. అనంతరం అగ్గిపెట్టె తీసుకుని అంటించుకోవటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ వెంటనే అతడ్ని అరెస్ట్‌ చేశారు.

చదవండి : టీఎస్‌పీఎస్‌సీ పేరుతో నకిలీ ఈమెయిల్‌

గ్రామ వాలంటీర్‌ దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement