హైదరాబాద్‌లో దారుణం.. యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది | Man Attack On Woman With Knife For Rejecting Love At Borabanda | Sakshi
Sakshi News home page

Hyderabad: బోరబండలో దారుణం.. యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

Published Mon, Apr 24 2023 5:42 PM | Last Updated on Mon, Apr 24 2023 7:34 PM

Man Attack On Woman With Knife For Rejecting Love At Borabanda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోరబండలోని బంజారానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. సురేష్‌ అనే వ్యక్తి ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా లక్ష్మీ అనే యువతి వెంటపడుతున్నాడు. అయితే యువకుడి ప్రేమను లక్ష్మీ నిరాకరించింది.

ఈ క్రమంలో సోమవారం స్కూటీపై వెళ్తున్న యువతిని అడ్డగించిన సురేష్‌.. ఒక్కసారిగా కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. దీంతో లక్ష్మీ గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది ప్రేమోన్మాదిని అడ్డుకున్నారు. నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకొని చితకబాదిన స్థానికులు.. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ప్రేమోన్మాది దాడిలో యువతికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి: యూపీలో దారుణం.. హోటల్‌ గదిలో విగతజీవిగా వైద్యాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement