మృతదేహాన్ని పీక్కుతిన్న పందులు | Man Assassinated With Stones In Narayankhed | Sakshi
Sakshi News home page

దారుణ హత్య: మృతదేహాన్ని పీక్కుతిన్న పందులు

Dec 16 2020 10:31 AM | Updated on Oct 17 2021 12:52 PM

Man Assassinated With Stones In Narayankhed - Sakshi

పొదల్లో పడి ఉన్న మృతదేహం, ఇన్‌సెట్లో వడ్డె రాజు (ఫైల్‌) 

సాక్షి, నారాయణఖేడ్ ‌: బండరాళ్లతో మోది యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నారాయణఖేడ్‌ జంట గ్రామం మంగల్‌పేట్‌లో చోటుచేసుకుంది. మృతదేహన్ని పందులు పీక్కుతింటుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నారాయణఖేడ్‌–2 ఎస్‌ఐ మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్‌ మండలం ఖాజాపూర్‌కు చెందిన వడ్డె రాజు (23) ఇస్నాపూర్‌లో పని చేసేందుకు వెళ్తున్నానని సోమవారం ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం  పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ఆవరణలోని చెట్లపొదల్లో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పందులు పీక్కు తింటుండగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సీఐ రవీందర్‌రెడ్డి పరిశీలించారు.

క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్‌ను పిలిపించారు. మృతదేహం గుర్తించడానికి వీలులేకుండా మారింది. మర్మాంగాలు కోసినట్లు గుర్తించారు. సమీపంలో రక్తపు మరకలతో రెండు బండరాళ్లు ఉండడంతో తలపై బండరాళ్లతో మోది హత్యచేసినట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో రెండు జతల చెప్పులు, బెల్టు, మృతుడి ఒంటిపై ఉన్న దుస్తుల్లో ఓ పర్సు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులను స్వా«దీనం చేసుకున్నారు. అందులోని వివరాల ఆధారంగా మృతుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చెందిన వడ్డె సునీల్‌ వచ్చి మృతదేహాన్ని పరిశీలించి తన సోదరుడు వడ్డె రాజుగా గుర్తించాడు. డాగ్‌ స్క్వాడ్‌ మృతదేహం వద్ద ఉన్న చెప్పుల వాసన చూసి సమీపంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలోంచి ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వరకు వెళ్లి తిరిగి మృతదేహం సమీపానికి వచ్చి ఆగింది. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మొగులయ్య తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement