Hyderabad Man Brutally Murdered In Miyapur Bus Stand - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఘోరం.. మియాపూర్‌ బస్టాండ్‌లో వ్యక్తి దారుణ హత్య

Feb 9 2023 12:05 PM | Updated on Feb 9 2023 1:06 PM

Man Assassinated At Miyapur Bus Stand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ బస్టాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దుండగుల దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.

తాగిన తర్వాత ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమై ఉండవచ్చాని పోలీసులు భావిస్తున్నారు. బండరాయితో నెత్తి పైన గట్టిగా కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. మృతుడిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement