మరిచిపో అని చెప్పినందుకు.. ప్రియురాలిని హత్య చేసి ఆత్మహత్య | Man Assassinated Lover And Commits Suicide At Karnataka | Sakshi
Sakshi News home page

మరిచిపో అని చెప్పినందుకు.. ప్రియురాలిని హత్య చేసి ఆత్మహత్య

Jul 23 2022 2:24 PM | Updated on Jul 23 2022 2:34 PM

Man Assassinated Lover And Commits Suicide At Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: ప్రేమికురాలిని గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి జిల్లా సవదత్తిలో గురువారం రాత్రి జరిగింది. తాలూకాలోని బూదిగొప్పకు చెందిన రామచంద్ర తెణగి(29)రాణిచెన్నమ్మ వర్శిటీలో పీజీ చదువుతున్నాడు. ఇదే తాలూకా మద్లూరుకు చెందిన రేణుకా పచ్చణ్ణవర(30) బెళగావిలోని బసవ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం రాత్రి రేణుకా ఇంటికి రామచంద్ర రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆవేశానికి గురైన రామచంద్ర రేణుక గొంతుకు వైరు బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మామకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ పంపి అదే గదిలో ఉరివేసుకున్నాడు. శుక్రవారం ఉదయం పోలీసులు వచ్చి పరిశీలించారు. తనను మరిచిపో అని రేణుకా చెప్పడంతో ఆమెను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడు రామచంద్ర సూసైడ్‌ నోట్‌ రాసినట్లు గుర్తించినట్లు డీసీపీ రవీంద్ర  తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement