లాక్‌డౌన్‌ దెబ్బ.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక | Man And His Son Trying Take Own Life In Medchal | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ దెబ్బ.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక

Jun 5 2021 9:08 PM | Updated on Jun 5 2021 9:11 PM

Man And His Son Trying Take Own Life In Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన  కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బండ్లగూడా ఈడెన్‌ గార్డెన్‌ కాలనీలో ఉండే దూదేకుల ప్రవీణ్‌ కుమార్‌(39) లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా బాగా చితికిపోయాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం కుమారుడు యశ్వంత్‌(6) ఒంటిపై కిరోసిన్‌ పోసి,తాను పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు 108లో ఉస్మానియా హాస్పిటల్‌కు వెద్యానికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement