ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి... | Sakshi
Sakshi News home page

ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి...

Published Wed, Jul 13 2022 8:00 PM

Man Allegedly Murdered His Girlfriend  Latter He Committee Suside - Sakshi

ఇటీవల కొంతమంది తమను మోసం చేశారనో లేక తమతో ప్రేమగా ఉండటంలేదనో వంటి కారణాలతో దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇరు జీవితాలు నాశనమవ్వడమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోటు జరుగుతూనే ఉంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌ సిటీలోని 27 ఏళ్ల యువకుడు తన ప్రియురాలు తనకు తీరని ద్రోహం చేసిందనే కోపంతో ఆమెను పదునైన ఆయుధంతో హత మార్చాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పారు.

అతని వద్ద దొరికిన సూసైడ్‌నోట్‌లో ...తాను రాయ్‌పూర్‌లోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ డయల్-112లో కాల్ ట్రాకర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐతే తాను ప్రేమిస్తున్న అమ్మాయి తనను మోసం చేస్తూ వేరొకరిని ప్రేమించడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు. ఈ ఇద్దరూ కూడా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే..)

Advertisement
 
Advertisement