చదువు కోసం చెట్టెక్కిన విద్యార్థులు..

Maharashtra: Students Climb Network Tree Village For Online Classes - Sakshi

ముంబై: కరోనా కారణంగా స్కూళ్లు మాతపడిన విషయం తెలిసిందే. ఆన్‌ లైన్‌ క్లాస్‌లు కోసం విద్యార్ధులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. మహారాష్ట్ర లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ సరిగా లేక విద్యార్ధులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోండియా జిల్లాలోని మూరుమూల గ్రామానికి చెందిన విద్యార్థులు మొబైల్‌ సిగ్నల్‌ కోసం గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్లి  ఆ చెట్టు ఎక్కి తమ మొబైల్‌ ఫోన్లలో ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారు.

 మొబైల్‌ టవర్‌కు 200 మీటర్ల ఉన్న ఈ చెట్టును నెట్‌వర్క్‌ ట్రీగా వారు పిలుస్తారు. గత 15 నెలల్లో సుమారు 150 మంది గ్రామీణ విద్యార్థులు ఈ చెట్టు వద్దకు వచ్చి ఆన్‌లైన్‌ క్లాసులు విన్నట్లు స్థానికులు తెలిపారు.ఒక వైపు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అడుగులు వేస్తుంటే ..మరో వైపు ఇటువంటి సంఘటనలు జరగడం మన దేశ దౌర్భాగ్యాన్నీ ప్రతిబింబిస్తోందని స్థానికులు  అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top