Madhya Pradesh Indore Fire Accident Today 7 People Died - Sakshi
Sakshi News home page

Indore Fire Accident: ఇండోర్‌లో ఘోర ప్రమాదం.. గాఢనిద్రలోనే ఏడుగురి సజీవ దహనం!

May 7 2022 9:00 AM | Updated on May 7 2022 10:58 AM

Madhya Pradesh: Fire Accident Kills Few Indore - Sakshi

గాఢ నిద్రలో ఉండగా..  అగ్నికి బతుకులు బూడిద అయ్యాయి. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లో  ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్‌లో ఓ రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించినట్లు ఇండోర్‌ కమిషనర్‌ హరినారాయణ చారి మిశ్రా తెలిపారు. 

తొమ్మిది మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం వేకువ జామున నాలుగు, ఐదు గంటల మధ్య ఇండోర్‌ స్వర్ణ్‌ భాగ్‌ కాలనీలోని ఓ రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉండగా జరిగిన ప్రమాదంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.  ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement