పబ్జీ దారుణం.. గేమ్‌ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్‌ తీసుకుని

Lucknow Boy Shoots Mother Pistol For Stops Playing Pubg - Sakshi

లక్నో: పిల్లలకి ఆటలంటే చాలా ఇష్టం. అయితే ప్రస్తుత ఇంటర్నెట్‌ యుగంలో ఆన్‌లైన్‌ ఆటలను పిల్లలు ఆడటమే కాదు వాటికి బానిసలా మారుతున్నారు. ఎంతలా అంటే వీటి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా  ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీ ఆడకుండా అడ్డుకున్నందుకు ఏకంగా తన తల్లినే కాల్చి చంపాడు ఓ మైనర్ బాలుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల కొన్ని నెలలుగా ఓ మైనర్‌ బాలుడు ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీని ఆడటం ప్రారంభించాడు. అయితే రాను రాను అన్ని పనులను, చదువుని పక్కన పెట్టి ఈ గేమ్‌ను ఆడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి అతడిని పబ్జీ ఆడవద్దని సూచించేది. అయితే బాలుడు ఆడుతున్న ప్రతి సారి తన తల్లి గేమ్‌ వద్దని వారించడంతో కోపంతో ఊగిపోయాడు. దీంతో బాలుడు క్షణికావేశంలో తన తండ్రి పిస్టల్‌ తీసుకుని తల్లిని కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: హైదరాబాద్‌ టెకీ పాడుపని.. ఇన్‌స్టాలో యువతులకు వీడియో కాల్‌ చేసి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top