కోరికను తీర్చాలన్న కామాంధుడికి యావజ్జీవం! | Life imprisonment for the accused in the murder case | Sakshi
Sakshi News home page

కోరికను తీర్చాలన్న కామాంధుడికి యావజ్జీవం!

Mar 9 2021 1:50 PM | Updated on Mar 9 2021 1:54 PM

 Life imprisonment for the accused in the murder case - Sakshi

మహబూబ్‌నగర్‌: హత్య కేసులో ఓవ్యక్తికి యావజ్జీవ శిక్షతోపాటు జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.బాలగంగాధర్‌రెడ్డి కథనం మేరకు.. రెండేళ్ల క్రితం ఫరూక్‌నగర్‌ మండలం ఎలికట్టకి చెందిన జంగం మంగమ్మ (34)ను..జంగం రాములు తన కోరికను తీర్చాలని ఒత్తిడి చేసేవాడు. అదేక్రమంలో 2019 మార్చి 26న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మంగమ్మను నా కోరిక తీర్చకపోతే నిన్ను బతకనివ్వనంటూ జంగం రాములు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. అటుగా వెళ్తున్న వారు మంటలు ఆర్పి  షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించగా మార్గ మధ్యలో మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. అప్పటి షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌ కుమార్‌ నేర అభియోగపత్రం దాఖలు చేయగా, న్యాయస్థానంలో కేసు విచారణ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.బాలగంగాధర్‌రెడ్డి 19 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న తర్వాత నేరస్థుడిగా రాములు రుజువుకావడంతో యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌. ప్రేమావతి తీర్పు ఇచ్చారు.    

చదవండి: మహిళపై 10 మంది గ్యాంగ్‌ రేప్‌, వీడియో ప్రత్యక్షం!   

Advertisement
 
Advertisement
Advertisement