
ఇంటి బయట ఆడుకుంటూ హఠాత్తుగా కనిపించపోయేసరికి ఏం జరిగిందోనని..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడకుంటూ అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి మనోజ్.. శవమై కనిపించాడు. మనోజ్ మృతదేహాన్ని దగ్గర్లోని క్వారీ గుంత నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.
చిన్నారి ఎలా చనిపోయి ఉంటాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. వీధి కుక్కల వల్లే తమ కొడుకు చనిపోయి ఉంటాడని మనోజ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు వెంటపడి ఉంటాయని, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో క్వారీ గుంతలో పడిపోయి ఉంటాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.