యువకుడు దుర్మరణం
చేవెళ్ల: ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని కేసారం గేట్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కోప్లా జిల్లా గంగవతి మండలం గుండూరు గ్రామానికి చెందిన వాసంశెట్టి రామకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ముడిమ్యాల శివారులోని ఓ వ్యవసాయక్షేత్రంలో కొంతకాలంగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రామకృష్ణ చిన్న కుమారుడు శ్రీనివాస్(27) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం శ్రీనివాస్ చేవెళ్లకు బైక్‌పై వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఎదురుగా వస్తున్న వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


