తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలి

Mar 15 2026 6:43 AM | Updated on Mar 15 2026 6:43 AM

కందుకూరు: పంచాయతీ ట్రాక్టర్‌ వచ్చినప్పుడు తడి, పొడి చెత్త వేరు చేసి వేసేట్టు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జాన్‌వెస్లీ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని తిమ్మాపూర్‌ను ఆయన సందర్శించారు. గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, వన నర్సరీ, కంపోస్టు యార్డు తదితరాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని గ్రామాలు ఇదే విధంగా నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఆయన వెంట డీపీఓ సురేష్‌మోహన్‌, డీఎల్‌పీఓ సమీరెడ్డి, ఎంపీడీఓ సరిత, ఎంపీఓ గీత, పంచాయతీకార్యదర్శి శ్రీధర్‌, ఉప సర్పంచ్‌ సన్నిళ్ల సంధ్య, ఎఫ్‌ఏ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

తుమ్మలూరులో పర్యటన

మహేశ్వరం: గ్రామంలో తడి–పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేసి రైతులకు సబ్సిడీపై అందించాలని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ జాన్‌వెస్లీ పేర్కొన్నారు. మండల పరిధిలోని తుమ్మలూరులో శనివారం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యటించారు. కంపోస్టు యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌ మోహన్‌, డీఎల్‌పీఓ సాంభిరెడ్డి, ఎంపీఓ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ తుమ్మటి అండాలు, ఉప సర్పంచ్‌ సంగారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ అశోక్‌, పంచాయతీ కార్యదర్శి అలివేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement