కొందుర్గు: రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రశ్నించారు. శనివారం జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని లాల్‌పహాడ్‌లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కేంద్ర అసమర్థ పాలనతో గ్యాస్ కొరత ఏర్పడి రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయని ఆరోపించారు. ఆమెరికా, ఇజ్రాయిల్‌తో దోస్తి కట్టి ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ స్వతంత్ర, డెమోక్రటిక్ దేశమని గుర్తుచేశారు. ఇంధనం కోసం ఏ దేశం వద్ద మోకరిల్ల వలసిన పరిస్థితి లేదని, నేరుగా కొనుగోలు చేయొచ్చని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పరాయి దేశాల వద్ద భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు బుద్దుల జంగయ్య, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టంగుటూరి నర్సింహారెడ్డి, నాయకులు సురేష్, వీరేశ్, వెంకటేశ్, గోపాల్, నర్సింహ, బాలకృష్ణయ్య, చిల్కమ్మ, సందమ్మ పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య


