ఐఎన్‌ఎల్‌డీ హరియాణా చీఫ్‌ కాల్చివేత | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎల్‌డీ హరియాణా చీఫ్‌ కాల్చివేత

Published Mon, Feb 26 2024 6:07 AM

INLD Haryana unit president Nafe Singh Rathee shot dead in Jhajjar - Sakshi

చండీగఢ్‌: ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ హరియాణా విభాగం అధ్యక్షుడు నఫె సింగ్‌ రాథీ(70)ని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. ఢిల్లీకి సమీపంలోని బహదూర్‌గఢ్‌ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో ఒక పార్టీ కార్యకర్త చనిపోగా ఆయన ప్రైవేట్‌ గన్‌మెన్లు ముగ్గురు గాయాలపాలయ్యారు.

ఝజ్జర్‌ జిల్లాలోని బహదూర్‌గఢ్‌ నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన ఎస్‌యూవీలో వెళ్తున్న రాథీని కారులో వెంబడించిన దుండుగులు ఆయనపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్‌ చౌతాలా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన దాడిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించాయి.

Advertisement
 
Advertisement