unidentified assailants
-
పంజాబ్‌లో ఆప్ కార్యకర్త కాల్చివేత
అమృత్సర్: పంజాబ్‌లో అధికార పార్టీ ఆప్‌నకు చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. తారన్‌తారన్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపీ చోహల్ కోర్టు కేసు విషయమై కపుర్తలా వైపు కారులో ఒక్కడే వెళ్తున్నాడు. కారును వెంబడిస్తున్న దుండగులు ఫతేబాద్, గోయిండ్వాల్ సాహిబ్ మధ్యలోని రైల్వే క్రాసింగ్ వద్ద అతడిపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి పరారయ్యాడు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు గుర్ప్రీత్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
ఐఎన్ఎల్డీ హరియాణా చీఫ్ కాల్చివేత
చండీగఢ్: ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ హరియాణా విభాగం అధ్యక్షుడు నఫె సింగ్ రాథీ(70)ని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. ఢిల్లీకి సమీపంలోని బహదూర్గఢ్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల్లో ఒక పార్టీ కార్యకర్త చనిపోగా ఆయన ప్రైవేట్ గన్మెన్లు ముగ్గురు గాయాలపాలయ్యారు. ఝజ్జర్ జిల్లాలోని బహదూర్గఢ్ నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన ఎస్‌యూవీలో వెళ్తున్న రాథీని కారులో వెంబడించిన దుండుగులు ఆయనపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన దాడిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. -
దుండగుల కాల్పుల్లో టీఎంసీ నేత దారుణ హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC)నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆదివారం మధ్యాహ్నం జరిపిన కాల్పుల్లో టీఎంసీ నేత స్థాయన్ చౌదరి మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు గుంపుగా బైకులపై వచ్చి స్థాయిన్ చౌదరిపై కాల్పులు జరిపారు. వెంటనే ఆయన్ను స్థానిక అస్పత్రికి తరలించగా.. అప్పటకే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన బెంగాల్‌లోని బహారామ్‌పూర్‌లో జరిగింది. ప్రస్తుతం ఆయన టీఎంసీలో ముర్షిదాబాద్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జార్ఖండ్ సీఎంకు ఏడోసారి ఈడీ నోటీసులు.. ఆయన సోదరి ఫైర్ -
బండరాయితో మోది..మహిళ దారుణ హత్య
మైలార్‌దేవ్‌పల్లి : మహిళను గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతంగా హత్య చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో శాస్త్రీపురం నిర్మాణుష్యా ప్రాంతంలోని జీహెచ్ఎంసీ పార్కులో మంటలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మహిళ ముఖంపై బండరాయితో మోది హత్య చేసి ఉన్న ఆనవాళ్లు కనిపించాయి. మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో వెంటనే పోలీసులు శాస్త్రీపురం చేరుకుని గుర్తు తెలియని మహిళ శవం ఫోటోలు తీసి రాత్రి నుంచి పార్కు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె ఆచూకీ కోసం వెతికారు. చివరకు శనివారం మధ్యాహ్నం మహిళ ఆరాంఘర్ గుడిసెల్లో నివాసం ఉండే తిరుపతి భార్య పద్మమ్మ(35)గా పోలీసులు గుర్తించారు. ఆరాతీయగా పోలీసులకు కొంత సమాచారం లభించింది. శుక్రవారం దానమ్మ హట్స్‌లోని కల్లు కాంపౌండ్‌లో తిరుపతి, పద్మమ్మ దంపతులతోపాటు తిరుపతి స్నేహితుడు శాస్త్రీపురంలో ఉండే విష్ణు.. ముగ్గురూ కలిసి కల్లు సేవించారు. తిరుగు ప్రయాణంలో విష్ణు శాస్త్రీపురంలోని ఇళ్లల్లో పని చూపిస్తానని చెప్పి పద్మమ్మను తీసుకెళ్లి రాఘవేంద్ర కాలనీ వద్ద దింపాడు. కాగా పద్మమ్మ భర్త ఇంటికి వెళ్లిపోయాడు. విష్ణుతో వెళ్లిన తన భార్య హత్య చేయబడిందని విష్ణుపై తనకు అనుమానం ఉందని తిరుపతి పోలీసులకు చెప్పాడు. రాఘవేంద్ర కాలనీ పార్కు వద్ద సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలానికి శంషాబాద్ డీసీపీ పద్మజ, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్‌కుమార్, మైలార్‌దేవ్‌పల్లి సీఐ జగదీశ్వర్లు చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. -
దంపతుల దారుణ హత్య
విజయవాడ ప్రతి రోజు సంచలన ఘటనలతో వార్తల్లోకెక్కుతోంది. విజయవాడ నగరంలోని రామలింగేశ్వరనగర్లో చేపల మార్కెట్ పక్కన దంపతులను గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం వేకువజామున చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఉదయం 11 గంటల ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. గంగాధర్(45) ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయన భార్య రామాంజులమ్మ(40). ఇద్దరూ రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా దండగులు ప్రవేశించి కత్తులతో ఇద్దరి గొంతులు కోసి హతమార్చారు. ముఖాలపై కారంపొడిని చల్లారు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు ఉదయం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రంభించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
విజయవాడలో దంపతుల దారుణ హత్య
-
పొదిలిలో యువకుని హత్య
కోడి పందాలు ఓ యువకుడి నిండు ప్రాణాలు తీశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పొదిలి గ్రామంలోని శ్రీపతినగర్‌లో సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుని కత్తులతో పొడిచి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(27) కోడిపందేలు ఆడేవాడు. కాగా.. అక్కడ కొంత మంది తో ఘర్షణలు తలెత్తాయి. అక్కడ జరిగిన గొడవ కారణంగా కొందరు వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లుపై కత్తులతో దాడి చేశారు. అతడిని అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జర్నలిస్టు శంకర్‌ను చంపిందెవరు..?
-
మహిళపై అత్యాచారం.. హత్య
హైదరాబాద్ శివార్లలో దారుణం సాక్షి, హైదరాబాద్: కొందరు దుండగులు ఓ మహిళపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కత్తులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వాహనాల కింద పడి చనిపోయేలా నడిరోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఆ మహిళను గమ నించిన ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. కానీ, చికిత్స పొందుతూ మరణించింది. హైదరాబాద్ శివార్లలోని హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి అనంతరం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నగర శివారులోని హిమాయత్‌సాగర్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఒక మహిళ తీవ్ర గాయాలతో పడి ఉందని బుధవారం అర్ధరాత్రి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి పోలీసులు చేరుకోగా.. మద్యం మత్తులో ఉన్న ఆమె నుదురు, చేతులపై కత్తులతో కోసిన గాయాలున్నాయి. తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఉస్మానియాకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. అయితే తనపేరు లలిత అని ఒకసారి, శిరీష అని ఒకసారి, స్వరూప అని మరోసారి.. సొంతగ్రామం మహబూబ్‌నగర్ అని, మరోసారి ఎర్రబోడ అని తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆ మహిళపై లైంగికదాడి చేసి, కత్తులతో దాడిచేసి ఔటర్ రింగ్‌రోడ్డుపై పడవేశారని పేర్కొన్నారు. కాగా, ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేపట్టామని, ఇప్పటికే మిస్సింగ్ కేసులపై దృష్టి సారించామని, మృతురాలి ఫొటోను అన్ని పోలీస్స్టేషన్లకు పంపామని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కుశాల్కర్ తెలిపారు. దీంతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డుపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
దంపతులపై కత్తులతో దుండగుల దాడి.. భర్త దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భార్యాభర్తలపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి భర్తను దారుణంగా గొంతుకోసి చంపారు. ఈ దాడిలో భార్య తీవ్రంగా గాయుపడింది. ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించుకుపోయారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ జేబీఎస్ డిపోలో మెకానిక్‌గా ఉంటున్న మల్కాజిగిరి దుర్గానగర్‌కు చెందిన గాజుల వెంకటేశ్వరరావు (27)కు, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సౌజన్యతో ఈ ఏడాది మే 29న వివాహం జరిగింది. దంపతులు శనివారం మోటర్ సైకిల్‌పై సంఘీ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తూ, రాత్రి ఏడున్నర గంటలకు ఉమర్‌ఖాన్‌గూడ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగారు. అక్కడే పొంచిఉన్న ముగ్గురు దుండగులు వారిపై కత్తులతో దాడిచేసి, వెంకటేశ్వరరావును గొంతుకోసి అతి దారుణంగా చంపారు. దాడిలో సౌజన్య తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని గవునించిన స్థానికులు పోలీసులకు సవూచారం ఇచ్చారు. సౌజన్య మెడలో బంగారు గొలుసు లాక్కుంటున్న దుండగులు.. తవును ప్రతిఘటించిన వెంకటేశ్వరరావుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయుపడిన సౌజన్యను హయత్‌నగర్‌లోని టైటన్ ఆసుపత్రికి తరలించారు. దుండగులు బంగారంకోసమే దాడి చేశారా?. మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
న్యూఢిల్లీలో మహిళపై యాసిడ్‌తో దాడిచేసిన అగంతకులు
న్యూఢిల్లీ: దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. ఒంటరిగా కనిపించిన మహిళలపై అగంతకులు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా దాడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మెన్న దేశరాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ ఘటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటన మరవకముందే గురువారం ముంబైలో ఓ ఫోటో విలేకరి అత్యాచారానికి గురైంది. ఇలా ప్రతిచోటా మహిళలు దాడులకు గురవుతూనే ఉన్నారు. న్యూఢిల్లీలో ఓ 40ఏళ్ల మహిళపై శుక్రవారం యాసిడ్ దాడి జరిగింది. ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మోటర్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు అగంతకులు యాసిడ్‌తో దాడిచేశారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్ర ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. యాసిడ్ మంటలు భరించలేక ఆమె గట్టిగా కేకలు వేయడంతో అగంతకులు ఘటనా స్థలం నుంచి పరారైయ్యారు. గాయపడిన ఆ మహిళను చికిత్స మేరకూ దగ్గరలో ఉన్న జీటీబీ ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ తీవ్రత కారణంగా ఆ బాధితురాలు ఉదరభాగం, మెఖం సగం వరకూ కాలిపోయినట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం ఆ మహిళ డిచార్జ్ అయినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ యాసిడ్ దాడిలో మహిళ కుటంబ సభ్యుల ప్రమేయం ఉండవచ్చనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.