దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. ఒంటరిగా కనిపించిన మహిళలపై అగంతకులు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా దాడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. ఒంటరిగా కనిపించిన మహిళలపై అగంతకులు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా దాడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మెన్న దేశరాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ ఘటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటన మరవకముందే గురువారం ముంబైలో ఓ ఫోటో విలేకరి అత్యాచారానికి గురైంది. ఇలా ప్రతిచోటా మహిళలు దాడులకు గురవుతూనే ఉన్నారు.
న్యూఢిల్లీలో ఓ 40ఏళ్ల మహిళపై శుక్రవారం యాసిడ్ దాడి జరిగింది. ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మోటర్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు అగంతకులు యాసిడ్‌తో దాడిచేశారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్ర ఢిల్లీలోని దిల్‌షాద్ గార్డెన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. యాసిడ్ మంటలు భరించలేక ఆమె గట్టిగా కేకలు వేయడంతో అగంతకులు ఘటనా స్థలం నుంచి పరారైయ్యారు. గాయపడిన ఆ మహిళను చికిత్స మేరకూ దగ్గరలో ఉన్న జీటీబీ ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ తీవ్రత కారణంగా ఆ బాధితురాలు ఉదరభాగం, మెఖం సగం వరకూ కాలిపోయినట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం ఆ మహిళ డిచార్జ్ అయినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ యాసిడ్ దాడిలో మహిళ కుటంబ సభ్యుల ప్రమేయం ఉండవచ్చనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.