పొదిలిలో యువకుని హత్య | The young man's murder in Podili | Sakshi
Sakshi News home page

పొదిలిలో యువకుని హత్య

Nov 2 2015 2:16 PM | Updated on Sep 3 2017 11:54 AM

కోడి పందాలు ఓ యువకుడి నిండు ప్రాణాలు తీశాయి.

కోడి పందాలు ఓ యువకుడి నిండు ప్రాణాలు తీశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పొదిలి గ్రామంలోని శ్రీపతినగర్‌లో సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుని కత్తులతో పొడిచి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(27) కోడిపందేలు ఆడేవాడు. కాగా.. అక్కడ కొంత మంది తో ఘర్షణలు తలెత్తాయి. అక్కడ జరిగిన గొడవ కారణంగా కొందరు వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లుపై కత్తులతో దాడి చేశారు. అతడిని అతి కిరాతకంగా చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement