భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్‌ జెండర్‌ని ఇంటికి రప్పించి... | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్‌ జెండర్‌ని ఇంటికి రప్పించి...

Published Thu, Sep 1 2022 10:07 AM

Indore Police Solved Mysterious Transgender Death Case Accused Arrested - Sakshi

Mutilated Body Found In Indore: ఇండోర్‌లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్‌జెండర్‌ మృత దేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు.  ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం....పోలీసుల గుర్తించిన ఆ ట్రాన్స్‌జెండర్‌ మృతదేహంలో ఒక భాగం మాత్రమే లభించింది.

దీంతో పోలీసుల ఆ  పరిసర ప్రాంతాల్లో పీసీఫుటేజ్‌ని పరిశీలించగా.... చనిపోయిన ట్రాన్స్‌ జెండర్‌ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్‌ జోయా కిన్నార్‌గా గుర్తించారు. ఐతే ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్‌మహ్మద్‌గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను విచారణలో చెప్పిన విషాయలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. నిందితుడు విచారణలో అతని భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్‌జెండర్‌ జోయాతో సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేసినట్లు తెలిపాడు.

ఆ తర్వాత తాను జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించానని చెప్పాడు. ఇంటికి వచ్చాకే జోయా ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసిందని, దీంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతుకోసి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్‌ సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు తెలిపాడు.

మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోనే పెట్టేలో భద్రపరిచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు మిగతా భాగం మృతదేహాన్ని నిందితుడు నూర్‌మహ్మద్‌ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు  పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

(చదవండి: గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి)

Advertisement
 
Advertisement
 
Advertisement