కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం | Hyderabad: Teenage Girl Goes Missing From Banjara Hills | Sakshi
Sakshi News home page

కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం

Mar 21 2022 8:13 AM | Updated on Mar 21 2022 10:46 AM

Hyderabad: Teenage Girl Goes Missing From Banjara Hills - Sakshi

సాక్షి,బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): కళాశాలకు వెళ్లళ్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని శ్రీరాంనగర్‌లో నివసించే హస్నియా బేగం(19) మహబూబియా జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నది. ఈ నెల 17న కాలేజీకని వెళ్లిన హస్నియా సాయంత్రం తిరిగి రాకపోవడంతో తండ్రి షేక్‌ మషువుద్దీన్‌ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించారు.

ఆచూకీ తెలియకపోవడంతో తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని యువతి కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌: 90308 42080లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.  (చదవండి: ప్రేమించిన యువతి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య.. )

Advertisement
 
Advertisement
Advertisement