కారులో మరో కిరాతకం.. నెక్లెస్‌రోడ్డులో బాలికపై యువకుడి అత్యాచారం

Hyderabad: Man Molest Minor At Necklace Road - Sakshi

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌):  నగరంలో మరో మైనర్‌ బాలిక అత్యాచారానికి గురైంది. రొమేనియా బాలికపై సామూహిక లైంగికదాడి ఘటనలో విచారణ కొనసాగుతుండగా.. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం కలకలం సృష్టిస్తోంది. ఈ అఘాయిత్యం కూడా కారులోనే జరగడం గమనార్హం. సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) గోల్కొండ సూపర్‌వైజర్‌ రమ్య ఈ నెల 4న హుమయూన్‌నగర్‌ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి. 

కన్నేసి..కాటేశాడు: నింబోలి అడ్డకు చెందిన అనాథ బాలిక (17) మల్లేపల్లి విజయ్‌నగర్‌కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ స్థానికంగానే ఓ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌కు సమీపంలోని జిరాక్స్‌ షాపులో పనిచేసే సురేష్‌ (23) ఆమెపై కన్నేసి పరిచయం పెంచుకున్నాడు. బహుమతులు ఇచ్చి లోబరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పట్నుంచీ తరచూ ఫోన్‌ చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 20న ఉదయం 9 గంటలకు కళాశాలకు వెళ్తున్నామని హాస్టల్‌లో చెప్పి ఆ బాలిక, ఆమె స్నేహితురాళ్లు ఇద్దరు బయటకు వచ్చారు. తమ క్లాస్‌మేట్‌ రాహుల్‌ పుట్టిన రోజు వేడుక కోసం నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లారు.

ఆ వేడుకకు రావాల్సిందిగా సురే‹Ùను కూడా వారు ఆహా్వనించారు. అర్ధరాత్రి 12 గంటల సమ యంలో అందరూ బర్త్‌ డే వేడుకల్లో నిమగ్నమై ఉండగా నీతో మాట్లాడాలంటూ ఆ బాలికను పిలిచిన సురేష్‌ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత మామూలుగా హాస్టల్‌కు వచి్చన బాలిక కొద్దిరోజుల తర్వాత నలతగా ఉండటంతో హాస్టల్‌ సిబ్బంది ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

దీంతో సురే‹Ùపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హుమయూన్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన హుమయూన్‌నగర్‌ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతం రాంగోపాల్‌పేట పరిధిలోకి రావడంతో ఆ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. అప్పటికే హుమాయున్‌నగర్‌ పోలీసులు నిందితుడు సురే‹Ùపై ఐపీసీ 376 (2), సెక్షన్‌ 3 ఆర్‌/డబ్ల్యూ 4 పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన రాంగోపాల్‌పేట పోలీసులు సోమవారం సురే‹Ùను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు: బీజేపీ 
కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేత రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎనీ్వఎస్‌ఎస్‌ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు ధ్వజమెత్తారు. సోమవారం రాత్రి వారొక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. మైనర్‌ బాలికపై అత్యాచారాన్ని ఖం డించారు. హైదరాబాద్‌ హత్యలు, అత్యాచారాలు, దోపిడీలకు, డ్రగ్స్‌ దందాకు అడ్డాగా మారిందన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై టీఆర్‌ఎస్, మజ్లిస్‌ నాయకుల కుమారుల గ్యాంగ్‌ రేప్, దాష్టీకాలను మరువకముందే నెక్లెస్‌ రోడ్డులో మరో మైనర్‌ బాలికపై అత్యాచారం వెలుగు చూడటం అత్యంత బాధాకరమన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top