నిశ్చితార్థమైంది వదిలేయాలని కోరితే.. ‍ సన్నిహిత వీడియోలు కాబోయే భర్తకు పంపిస్తానని | Hyderabad Man Booked For Cheats Woman In The Name Of Love | Sakshi
Sakshi News home page

Hyderabad: నిశ్చితార్థమైంది వదిలేయాలని కోరితే.. ‍ కలిసి ఉన్న వీడియోలు కాబోయే భర్తకు పంపిస్తానని

Jun 9 2022 4:54 PM | Updated on Jun 9 2022 4:58 PM

Hyderabad Man Booked For Cheats Woman In The Name Of Love - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడిపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రవణ్‌కుమార్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి విలేజ్‌ దర్గా ప్రాంతానికి చెందిన యువతి లెక్చరర్‌గా పనిచేస్తుంది. 2017లో ఆమెకు అత్తాపూర్‌ కిషన్‌ భాగ్‌ ప్రాతానికి చెందిన దూరపు బంధువు నిహాల్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది.

గత ఏడాది జూలై 1న అత్తాపూర్‌ వెళ్లిన ఆమెను నిహాల్‌సింగ్‌ టెర్రస్‌ పైన ఉన్న గదికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఆ తర్వాత కూడా నిహాల్‌ సింగ్‌ పలు మార్లు లాడ్జీలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాధితురాలు గత డిసెంబర్‌లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పగా నిశ్చితార్థం జరిగినా తాను పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు.

గత ఫిబ్రవరిలో ఆమెకు నిశ్చితార్థం జరగడంతో తనను వదిలివేయాలని కోరగా తనతో కలిసి ఉన్న వీడియోలు తీశానని తన కోరిక తీర్చకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమేగాక కాబోయే భర్తకు కూడా పంపిస్తానని బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాక నిహాల్‌ సూచన మేరకు పెళ్లి కూడా రద్దు చేసుకుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు గుర్తించిన బాధితురాలు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడంతో ఈనెల 6న తల్లితో సహా తిరుమలగిరికి వచ్చిన నిహాల్‌ సింగ్‌ ఆమెను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో బాధితురాలు మంగళవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటన: బాధితురాలిని ట్రాప్‌ చేసింది ఎవరంటే..

Advertisement
 
Advertisement
Advertisement