Hyderabad: ఇల్లాలిని చంపిన భర్త | Wife Killed By Her Husband Due To Conflicts In Family In Narsingi, More Details Inside | Sakshi
Sakshi News home page

Hyderabad: ఇల్లాలిని చంపిన భర్త

Oct 9 2024 8:34 AM | Updated on Oct 9 2024 10:14 AM

husband killed by wife

కుటుంబ కలహాలే కారణం 

ఠాణాలో లొంగిపోయిన నిందితుడు  

మణికొండ: కుటుంబ కలహాలతో భార్యను చంపాడు ఓ భర్త. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌ మాధవీనగర్‌ కాలనీలో మంగళవారం జరిగింది. స్థానికులు, నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్‌ సాగర్, కృష్ణవేణి (32)కి పన్నెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచి్చన శ్రీనివాస్‌ సాగర్‌ హైదర్‌షాకోట్‌లోని ఓ టెంట్‌హౌస్‌లో పని చేస్తున్నాడు.   కుటుంబ కలహాలతో దంపతులిద్దరూ తరచూ గొడవపడేవారు. 

ఈ విషయంలో కృష్ణవేణి నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కక్షగట్టిన శ్రీనివాస్‌ సాగర్‌.. సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై సుత్తితో బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కృష్ణవేణి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పిల్లలను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపానంటూ శ్రీనివాస్‌సాగర్‌ లొంగిపోయాడు. కాగా.. కృష్ణవేణి హత్య విషయం తెలుసుకుని హైదర్‌షాకోట్‌కు చేరుకున్న ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న శ్రీనివాస్‌ సాగర్‌ను తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు.  మూడు గంటల పాటు వారిని పోలీసులు సముదాయించి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement