భార్యపై అనుమానం: గొంతు కోసి దారుణ హత్య | Husband Eliminate His Wife Over Doubt On Affairs In Tamilnadu | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానం: గొంతు కోసి దారుణ హత్య

Published Mon, Mar 22 2021 7:12 AM | Last Updated on Mon, Mar 22 2021 10:08 AM

Husband Eliminate His Wife Over Doubt On Affairs In Tamilnadu - Sakshi

సాక్షి, తిరువళ్లూరు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గొంతు కోసి దారుణంగా హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన ఆదివారం తిరువళ్లూరు జిల్లా ఎగువనల్లాటూరు వద్ద కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా ఎగువనల్లాటూరు గ్రామానికి చెందిన గోపి(36). చెన్నై ఆలందూరులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన భర్త నుంచి విడాకులు పొందిన మహేశ్వరిని ఫిబ్రవరి 14న వివాహం చేసుకుని ఎగువనల్లాటూరులో నివాసం వుంటున్నారు.

కొద్ది రోజులు వీరి జీవనం సజావుగా సాగింది. ఈక్రమంలో శనివారం రాత్రి భార్య ప్రవర్తనను అనుమానించి గోపి భార్యతో గొడవపడ్డాడు. ఆదివారం ఉదయం ఆలందూరు వెళ్లిపోతానని భార్య చెప్పడంతో ఆగ్రహించి గోపి, మహేశ్వరి గొంతు గోసి హత్య చేశాడు. అనంతరం గోపి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడ్ని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: చుట్టూ జనం, అయినా పొడిచి చంపాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement