భార్యభర్తల మధ్య గొడవ.. చున్నీని మెడకు చుట్టి..

Husband Assassinate His Wife In Adilabad - Sakshi

సాక్షి, కుంటాల(ఆదిలాబాద్‌): నిండు నూరేళ్లు తోడుగా ఉంటాడనుకున్న భర్తే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను చున్నీతో హత్య చేసి నేరుగా పోలీ స్‌స్టేషన్‌లో లొంగిపోయిన ఈ ఘటన మంగళవారం కుంటాలలో చోటు చేసుకుంది. సీఐ అజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండలం అందకూర్‌ గ్రామానికి చెందిన కట్ట నిఖిల్‌ మండలకేంద్రంలో మూడేళ్లగా బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. నిఖిల్‌కు ఈ ఏడాది జనవరి 8న భైంసా మండలంలోని కామోల్‌ గ్రామానికి విజయ–గంగాధర్‌ దంపతుల కుమార్తె గౌతమి(18)తో వివాహం జరిగింది. వీరు కుంటాలలోనే ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు.

నిఖిల్‌ నిత్యం భార్యను అనుమానించే వాడు. ఈ కారణంగా మంగళవారం ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో నిఖిల్‌ ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారే పరిశీలించారు. తహసీల్దార్‌ శ్రీధర్‌ మృతదేహానికి పంచనామా నిర్వహించగా.. ట్రైనీ ఎస్సై షరీఫ్‌ కేసు నమోదు చేసుకున్నారు. న్యాయం చేయాలని ఆందోళన గౌతమిని హత్య చేసిన నిఖిల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతురాలి బంధువులు, కామోల్‌ గ్రామస్తులు కల్లూర్‌–కుంటాల రహదారిపై ధర్నా చేపట్టారు. సీఐ అజయ్‌బాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతురాలి బంధువులకు నచ్చ జెప్పడంతో రాత్రిపూట ఆందోళన విరమించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top