మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి.. మూడు రోజులకే..

Husband Assasinate Tragedy In Karnataka - Sakshi

సాక్షి, యశవంతపుర(కర్ణాటక): భార్యతో గొడవ పడిన మూడు రోజులకే భర్త హతమయ్యాడు. ఈ ఘటన డీజే హళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. కృష్ణమూర్తి అనే వ్యక్తి మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం రెండో భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా నచ్చజెప్పి పంపించారు. శుక్రవారం రాత్రి ముగ్గురు దుండగులు కృష్ణమూర్తిని కావల్‌ భైరసంద్ర అంబేడ్కర్‌ కాలేజీ ఎదుట పొడిచి చంపారు. పోలీసులు కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చంపేస్తాననడంతో హత్య చేశాం
కెలమంగలం: తళి సమీపంలో గత నెల 29వ తేదీ జరిగిన రౌడీ హత్య చేసులో ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్‌ చేశారు. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని గుమ్మళాపురం గ్రామానికి చెందిన ప్రకాష్‌ కొడుకు ఉదయ్‌కుమార్‌ (30) పలు నేరాల్లో నిందితుడు. గూండా కేసులో జైలుకు వెళ్లి బయటకొచ్చిన ఇతను గత 29వ తేదీ దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో గుమ్మళాపురంకు చెందిన దేవరబెట్టప్ప కొడుకులు సంపంగి(35), రవి అనే భగవంత (28)లను పోలీసులు అరెస్టు చేశారు. హత్య చేస్తానని బెదిరించడంతో అతన్ని తామే చంపేశామని ఒప్పుకున్నారు.  

చదవం‍డి:రోమియోకు కటకటాలు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top