హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి | Girl Suspicious Death In Kurnool District | Sakshi
Sakshi News home page

హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి

Apr 23 2021 7:04 AM | Updated on Apr 23 2021 7:04 AM

Girl Suspicious Death In Kurnool District - Sakshi

మండల పరిధిలోని యాగంటిపల్లె గ్రామ సమీపంలో గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల వద్ద టి.అనూష(15) అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది.  

బనగానపల్లెరూరల్‌(కర్నూలు జిల్లా): మండల పరిధిలోని యాగంటిపల్లె గ్రామ సమీపంలో గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల వద్ద టి.అనూష(15) అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది.  గురువారం  ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నారాయణ్‌పేట జిల్లా మరికల్‌ మండలం రాకొండ గ్రామానికి చెందిన రాములు అతని కమార్తె అనూష కొన్ని రోజుల క్రితం.. జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ లైనింగ్‌ పనుల కోసం వచ్చారు. రాములు ఉదయం పనులు చేసేందుకు వెళ్లాడు.

పని ప్రదేశంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్ల వద్ద కుమార్తె ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాములు.. షెడ్‌ పక్కన కుమార్తె.. మంటల్లో కాలిపోయి, మృతి చెంది ఉండడాన్ని చూసి నిర్ఘాంత పోయాడు. విషయం తెలుసుకున్న సీఐ సురేష్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనూషను ఎవరైనా అత్యాచారం చేసి.. డీజల్‌ పోసి నిప్పటించి హత్య చేశారా? బాలిక ఆత్మహత్య చేసుకుందా? అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
చదవండి:
భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని...   
గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా..

Advertisement
 
Advertisement
Advertisement