విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారయత్నం

Auto Driver Assault Attempt On Student In Chittoor District - Sakshi

పీలేరు రూరల్‌(చిత్తూరు జిల్లా): విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారానికి యత్నించిన సంఘటన బుధవారం పీలేరులో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని యర్రగుంటపల్లె పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన విద్యార్థిని పీలేరులోని ఓ పాఠశాలలో చదువుతోంది. పాఠశాలకు ప్రతి రోజూ తోటి విద్యార్థులతో కలసి ఆటోలో వచ్చి తిరిగి ఆటోలో ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలో మిగతా తరగతులకు సెలవులు ఇవ్వడంతో మంగళవారం ఆ విద్యార్థిని మాత్రమే కాకులారంపల్లె పంచాయతీ కోళ్లఫారానికి చెందిన నరేష్‌ (30) ఆటోలో పాఠశాలకు బయలుదేరింది.

అయితే విద్యార్థిని ఒంటరిగా ఉండడంతో నరేష్‌ మార్గమధ్యంలో ఇందిరమ్మ కాలనీ సమీపంలోని పొలాల వైపు ఆటో మళ్లించాడు. అక్కడ విద్యార్థినిపై నరేష్‌ అత్యాచారానికి యత్నించడంతో విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా పాఠశాల వద్ద ఆ విద్యార్థినిని వదిలేశాడు. అయితే సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థిని జరిగిన సంఘటనపై తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బుధవారం బాధితులు పీలేరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫోక్సోయాక్టు కింద కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్‌ నరేష్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు.
చదవండి:
రెచ్చిపోతున్న ఆన్‌లైన్‌ మోసగాళ్లు.. 
కృష్ణా జిల్లా మంటాడలో దారుణం..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top