కలెక్టర్‌ పేరుతో వాట్సాప్‌ మెసెజ్‌లు.. అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డులంటూ..

Fraudsters Used Komaram Bheem Collector Photo AS DP And Seek Financial Help - Sakshi

సాక్షి, కుమురం భీం జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతో సైబర్‌ నేరగాళ్లు డబ్బులు వసూలు చేసిన ఘటన మరుకవముందే మరో సంఘటన చోటుచేసుకుంది. కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్  రాజ్ డీపీతో డబ్బుల కోసం  అదికారులకు వాట్సాప్‌ మెసెజ్‌లు పంపుతున్నారు. డబ్బులు, అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డుల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తున్నారు.

జిల్లా ఉన్నాతాదికారులకు, ఎమ్మార్వో, ఎంపీడీఓలకు మెసెలు పంపుతున్నారు. సైబర్  నేరగాళ్ల  మెసెజ్‌లతో అధికారులు భయపడిపోతున్నారు. అదేవిధంగా కలెక్టర్ అదికారులను అప్రమత్తం చేయడంతో  పోలీసులకు పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.   
చదవండి: ‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top