జగిత్యాల జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం.. | Four Deceased In Road Accident At Jagtial | Sakshi
Sakshi News home page

ఘోరరోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా..

Nov 9 2020 6:54 AM | Updated on Nov 9 2020 9:00 AM

Four Deceased In Road Accident At Jagtial  - Sakshi

సాక్షి, జగిత్యాల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని, కారు ఢీ కొట్టడంతో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో లత ,రమాదేవి, విష్ణు, ఆరు నెలల బాబు ఉన్నారు. శ్రీనివాస్, సృజన్, శ్రుతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం సారంగపూర్ మండలం పెంబట్ల వెళ్లిన కుటుంబ సభ్యులు, రాత్రి చల్‌గల్ నుంచి మల్లాపూర్ వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం.   (చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం)

Advertisement
 
Advertisement
Advertisement